MLG: రాష్ట్ర మంత్రి సీతక్కకు అరుదైన అవకాశం దక్కింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ‘నరేగా బచావో సంగ్రామ్’ పేరుతో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టింది. ఏఐసీసీ ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నారు. తొమ్మిది మంది సభ్యుల సమన్వయ కమిటీలో తెలంగాణ నుంచి మంత్రి సీతక్కకు చోటు కల్పించారు.