SKLM: ప్రభుత్వం పేద ప్రజల కోసం వేలాది కోట్లు వెచ్చించి అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థలో అలసత్వాన్ని సహించేది లేదని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళంలోని పలు రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బలగ వద్ద ఉన్న డిపోను పరిశీలించి గోధుమ పిండి బెల్లం ఎందుకు అమ్మ లేదన్నారు.