NDL: డోన్ మండలం సీసంగుంతలకు చెందిన వినోద్ జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటారు. తమిళనాడులో జరిగిన పోటీల్లో 80 కిలోల విభాగంలో ఆయన గోల్డ్ మెడల్ సాధించారు. గతంలో మిస్టర్ ఆంధ్రా పోటీల్లోనూ వినోద్ ప్రతిభ కనబరిచారు. కుటుంబసభ్యులు, కోచ్ల సహకారంతోనే ఈ విజయం దక్కిందని ఆయన తెలిపారు. ఈ ఘనతపై డోన్ ప్రాంత ప్రజలు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.