PPM: అధికంగా డీఏపీ, యూరియా వినియోగించడం వలన వ్యవసాయ పంటలలో జింక్ లోపం ఏర్పడి దిగుబడి తగ్గుతుందని మండల వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతి రావు తెలిపారు. మంగళవారం పాచిపెంట మండలం కేసలి గ్రామంలో పొలం పిలుస్తోంది నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న పంటలు పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. రైతులు డ్రోన్ వినియోగించి నానో యూరియా పిచికారి చేసుకోవాలని కోరారు.