బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈనెల 30 నుంచి ‘నెట్ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇందులో భారత్లో నుంచే రూ.800 కోట్లు వచ్చాయి.