SKLM: పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఎర్ర చెరువు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎర్ర చెరువు అభివృద్ధి ద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. పాతపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లడమే తమ లక్ష్యమని అన్నారు.