JN: గుర్తుతెలియని ఒక వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణ కేంద్రంలోని జనగామ రైల్వే స్టేషన్లో సోమవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుని తల, మొండెం వేరైంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు, మృతుడి సమాచారం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.