TG: MLC పదవికి రాజీనామాపై కల్వకుంట్ల కవిత వివరణ ఇచ్చారు. తన రాజీనామా ఆమోదించాలని కోరుతన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కంటతడి పెట్టారు. ప్రజల కోసమే పని చేశానని తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు BRS పార్టీ తనపై కక్ష కట్టిందని వెల్లడించారు. ఎనిమిదేళ్లుగా ప్రజల కోసం తాను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు.