విశాఖ: నగరంలో కాలుష్య నివారణకు జీవీఎంసీ పటిష్ట చర్యలను చేపట్టి గతంలో ప్రతి సోమవారం ‘నో వెహికల్ జోన్’ ప్రకటించింది. దీంతో జీవీఎంసీ మేయర్, కమిషనర్ సైతం ఆర్టీసీ బస్సులలో, సైకిల్ పైనా జీవీఎంసీ కార్యాలయానికి వచ్చేవారు. ఆ విధంగా వస్తూ ప్రతివారం వార్తలలో కనిపించేవారు. అయితే మేయర్ మారిన తరువాత నుంచి నో వెహికల్ జోన్ ఉందా.. లేదా అని ప్రజల ప్రశ్నిస్తున్నారు.