GDWL: రైతులు భూమి కోసం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు అని జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కేటిదొడ్డి మండలం పాగుంట గ్రామ శివారులో దారి సరిగా లేకపోయినా ద్విచక్ర వాహనంపై పొలాల్లోకి వెళ్లి, నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూముల సమస్యలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు.