W.G. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఇవాళ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించనున్న 500 మీటర్ల సీసీ రోడ్డు, పాలకోడేరు మేజర్ పంచాయతీలో 200 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. మరో మూడు వారాలలో ఈ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.