SRPT: మైనర్లు స్టీరింగ్ పడితే మూడేళ్ల వరకు లైసెన్స్ రాదని, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే జైలు శిక్ష తప్పదని ట్రాఫిక్ ఎస్సై సాయిరాం హెచ్చరించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం సూర్యాపేట పట్టణంలో అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, అతివేగం, త్రిబుల్ రైడింగ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు.