వరంగల్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం మామునూరు విమానాశ్రయం త్వరలోనే సాకారమవుతుంది. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ తుది దశకు చేరింది. భూమిని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించే ప్రక్రియ వేగవంతమైందని మంత్రి తెలిపారు.