Gold and Silver Rates Today : ధర తగ్గినప్పుడు పసిడి కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి ఆలోచనల్లో ఉన్న వారు రోజూ పసిడి ధరల్ని ఫాలో అవ్వాల్సిందే. అప్పుడే ధరలు కాస్త తగ్గినప్పుడు దీన్ని కొనుక్కోవడానికి వీలవుతుంది. మరి ఇవాల్టి వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. దేశీయ మార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్థిరంగా ఉంది. గురువారం రూ.74,760 ఉన్న పసిడి ధర శుక్రవారం సైతం అలాగే ఉంది.
చదవండి : రిషి సునాక్కు ఓటమి తప్పదా?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం తదితర చోట్ల సైతం పదిగ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర(Gold Rate) రూ.74,760గా ఉంది. అయితే ఈ ధర మార్కెట్ మొదలయిన సమయంలో ఉన్నది మాత్రమే. తర్వాత మళ్లీ దీని రేటులో మార్పులు చోటు చేసుకోవచ్చు. అలాగే వినియోగదారులు నగల్ని కొనుక్కునేప్పుడు ఈ ధరతో పాటుగా జీఎస్టీ, మజూరీల్లాంటి వాటిని కూడా చెల్లించాల్సి ఉంటుంది.
చదవండి : నేటి రాశిఫలాలు(2024 July 5th).. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate)లు మాత్రం రోజు రోజుకూ పెరుగుతున్నట్లుగానే కనిపిస్తున్నాయి. శుక్రవారం దీని ధర రూ.340 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.93,010కి చేరుకుంది. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం తదితర నగరాల్లోనూ వెండి ధరలు దాదాపుగా ఇలాగే ఉన్నాయి.
స్పాట్ గోల్డ్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్సు స్పాట్ గోల్డ్ ధర మూడు డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం దీని ధర 2361కి చేరుకుంది. అలాగే ఔన్సు వెండి ధర 30.53 డాలర్లుగా ఉంది.

