ఆషాఢ మాసంలో బంగారం, వెండి ధరలు కాస్త దిగి వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. వరుసగా మూడు రోజులుగా వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవడానికి ఇది చదివేయండి.
Gold rate decreased by more than 3000 last 10 days india
Gold Rate Today : బంగారం, వెండి కొనుక్కోవాలనే ఆలోచనల్లో ఉన్నారా? అయితే వీటి ధరలపై ఓ లుక్కేసి ఉంచండి. గత మూడు రోజులుగా వీటి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మరింత తగ్గితే నగల్ని కొనుక్కోవాలని అనుకునే వారు ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు. సోమవారం సైతం దేశీయ మార్కెట్లో పసిడి ధర (gold rate) స్వల్పంగా తగ్గింది. కేవలం రూ.88 మాత్రం తగ్గింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.75,462కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లాంటి చోట్ల సైతం పసిడి ధర దాదాపుగా ఇలాగే ఉంది. రూ.75,462గానే కొనసాగుతోంది. అయితే నగల కొనుగోలుదారులు మరో విషయాన్ని సైతం దృష్టిలో ఉంచుకోవాలి. నగల్ని కొనేప్పుడు మజూరీ, రాళ్లు, జీఎస్టీల్లాంటి వాటిని సైతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
దేశీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పైపైకి వెళ్లిన వెండి ధరలు(silver rates) వరుసగా మూడు రోజులుగా మాత్రం దిగి వస్తున్నాయి. సోమవారం సైతం స్వల్పంగా తగ్గాయి. రూ.165 తగ్గడంతో దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.91,285కు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. నేడు ఔన్సు స్పాట్ గోల్డ్ ధర సోమవారం ఆరు డాలర్లు పెరిగి 2407 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి 29.18 డాలర్లుగా ఉంది.