gold rate : గుడ్ న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు!
బంగారం, వెండి లోహాలను కొనుక్కోవాలని చూసే వారికి శుభవార్త. శుక్రవారం ఈ రెండింటి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
Gold Rate Today : బంగారం, వెండి లాంటి విలువైన లోహాలను కొనుక్కోవాలని అనుకునే వారు రోజూ వాటి ధరలను గమనించుకుంటూ ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే ధర తగ్గినప్పుడు వీటిని కొనుక్కునేందుకు ఆస్కారం ఉంటుంది. శుక్రవారం వెండి భారీగా తగ్గగా, పసిడి మాత్రం స్వల్పంగా తగ్గింది. దేని ధర ఎంత ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో పసిడి ధర(gold rate) నేడు రూ.299 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.75,990కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ లాంటి చోట్ల సైతం పసిడి ధర దాదాపుగా ఇలాగే ఉంది. అయితే నగల కొనుగోలుదారులు ఓ విషయాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకోవాలి. బంగారు నగల్ని కొనుగోలు చేసేప్పుడు రాళ్లు, మజూరీ, జీఎస్టీల్లాంటి వాటిని సైతం అదనంగా కట్టాల్సి ఉంటుంది.
ఇక దేశీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పైపైకి వెళ్లిన వెండి ధరలు(silver rates) రెండు రోజులుగా మాత్రం దిగి వస్తున్నాయి. గురువారం రూ.1400కు పైగా తగ్గిన వెండి, శుక్రవారం సైతం అంతే మొత్తంలో తగ్గింది. రూ.1,461 తగ్గి కేజీ వెండి ధర రూ.92,594కు చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు సైతం శుక్రవారం తగ్గాయి. నేడు ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 42 డాలర్లు తగ్గి 2426 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి 29.65 డాలర్లుగా ఉంది.