Gold and Silver Rates Today : బంగారం ధరలు గత రెండు రోజులుగా వరుసగా పెరుగుతున్నప్పటికీ గురువారం మాత్రం స్వల్పంగా తగ్గాయి. మరి ఇవాల్టి రేట్లు ఎంత ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో నేడు బంగారం ధర రూ.99మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.76,190కి చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధర దాదాపుగా ఇలాగే ఉంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాదుల్లో రూ.76,190గానే కొనసాగుతున్నాయి. అయితే ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవి మాత్రమే. ఆ తర్వాత మళ్లీ మారొచ్చు. అలాగే బంగారు నగల్ని కొనుక్కునే వారు ఈ ధరతో పాటుగా రాళ్లు, జీఎస్టీ, మజూరీల్లాంటి వాటిని సైతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అంతా దృష్టిలో ఉంచుకోవాలి.
ఇక దేశీయ మార్కెట్లో వెండి ధరలు గత కొద్ది రోజులుగా పైపైకి వెళుతూనే ఉన్నాయి. గురువారం మాత్రం ఇందుకు భిన్నంగా భారీగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర ఈ ఒక్కరోజే ఏకంగా రూ.1466 తగ్గింది. దీంతో కేజీ వెండి రేటు((Silver Rate) ) రూ.94,055కు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తుండగా గురువారం మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ ధరలు 4 డాలర్లు తగ్గి 2468 డాలర్లకు చేరుకున్నాయి. ఔన్సు వెండి స్వల్పంగా తగ్గి 30.43 డాలర్లుగా ఉంది.