SRPT: సర్పంచ్ ఎన్నికల నియమావళిపై పాలకీడు మండలం శూన్య పహాడ్ గ్రామంలో ఈరోజు పోలీసులు, జిల్లా కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. సీఐ చరమందరాజు మాట్లాడుతూ.. ప్రజలు నియమావళికి లోబడి, ప్రలోభాలకు గురికాకుండా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కోటేష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.