BDK: భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నా ప్రభుత్వం గానీ, అధికారుల గానీ పట్టించుకోవడంలేదు. రోజుకొకరు బలి అవుతున్నా స్పందించడం లేదు. ఎన్ని ధర్నలు చేసినా అధికారులకు చలనం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇసుక ర్యాంప్‌ల నిర్వాహణ వల్లనే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.