GNTR: ఈ నెల 5వ తేదీన చేబ్రోలు (M) నారాకోడూరు ZPHSలో జరిగే మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలోని మౌలిక వసతులు, ఏర్పాట్లను మెరుగుపరిచేందుకు సబ్ కలెక్టర్ సంజనా సింహ బుధవారం పాఠశాలను సందర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.