BPT: జిల్లాలో రూ. 3,191 కోట్లతో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం జిల్లాను అభివృద్ధిలోకి తీసుకువెళ్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉన్నందున ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు.