AKP: నూర్ బాషా దూదేకుల కమ్యూనిటీ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూచించారు. దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఇబ్రహీం బాషా బుధవారం ఎమ్మెల్యేను కలిశారు. అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తానని తెలిపారు.