దేశవ్యాప్తంగా 1232 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు డీజీసీఏ ప్రకటించింది. పలు విమానాశ్రయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరో వైపు పరిస్థితిని వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు ఇండిగో తెలిపింది. కొన్ని విమానాల సర్వీసులను రీషెడ్యూల్ చేస్తున్నట్లు చెప్పింది.