W.G: సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ సూచించారు. ఇటీవల భీమవరంకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ శర్మ నుంచి సైబర్ నేరగాళ్లు దశల వారీగా రూ. 78 లక్షలు దోచుకున్నారు. దీనిపై ఎస్పీ సూచనలతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 14 మంది నిందితులను గుర్తించారు. దీంతో బాధితుడు శర్మ బుధవారం ఎస్పీ నయీం అస్మీని సత్కరించారు.