W.G: ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ డిమాండ్ చేశారు. భీమవరంలో జిల్లా సంఘం అడ్హక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చట్టపరంగా ఉద్యోగులు పొందాల్సిన బకాయిలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం దశలవారీగా చెల్లించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.