TG: GHMC విస్తరణ ప్రక్రియ పూర్తైంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకునే బాధ్యత డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అప్పగించింది. నిన్నటి నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.