AP: విజయవాడ భవానీపురంలో 42 నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. కోర్టు ఆదేశాలతో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలో కూల్చివేత చేపట్టారు. దీంతో బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. 25 ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, బాధితులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.