KDP: సిద్దవటంలోని భాకరాపేట చెక్ పోస్ట్ వద్ద SI మహమ్మద్ రఫీ బుధవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాలు అరికట్టేందుకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. వాహన పత్రాలు లైసెన్సు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. హెల్మెట్ ధరించని 12 ద్విచక్ర వాహనదారులకు ఒక్కో వాహనానికి రూ.185చొప్పున అపరాధ రుసుము విధించామన్నారు.