రాయ్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 25 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్క్రమ్ (79*) మాథ్యూ (13*) ఉన్నారు. భారత బౌలర్లలో అర్ష్దీప్, ప్రసిద్ధ్ చెరో వికెట్ తీశారు.