BDK: కృతిక పౌర్ణమి సందర్భంగా దుమ్ముగూడెం మండలం నర్సాపురంలోని చిన్న అరుణాచలంగా పిలువబడే శివాలయంలో ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, సాయంత్రం లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి, స్వామివారిని దర్శించుకున్నారు.