MDK: మెదక్ జిల్లా కేంద్రంలో రేపటి నుంచి నిర్వహించనున్న సైన్స్ ఫెయిర్ వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను బుధవారం జిల్లా అదన కలెక్టర్ నాగేష్ పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించనున్న సైన్స్ ఫెయిర్ వైజ్ఞానిక ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు