SIR ద్వారా టీఎంసీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రమంత్రి అమిత్ షా భారీ కుట్ర చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావని హెచ్చరించారు. తను బతికి ఉన్నంత కాలం బెంగాల్ బీజేపీ చేతిలోకి వెళ్లదని తేల్చి చెప్పారు. బీజేపీని బెంగాల్ ప్రజలు నమ్మరని, ఆ పార్టీ మతం ద్వారా ఓటర్లను విభజించాలని చూస్తుందని ఆరోపించారు.