EG: దీర్ఘకాలిక వ్యాధుల కోసం అవసరమైన ఓపీడీ సేవలను ఆయుష్మాన్ భారత్ పథకంలో తక్షణమే చేర్చాలని రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. బుధవారం పార్లమెంటు సమావేశంలో ఆమె మాట్లాడారు. రూల్ 377 ప్రకారం ఆసుపత్రిలో ఇచ్చే ఔషధాల కవరేజీని 15 రోజుల పరిమితిని దాటి మరింత కాలానికి విస్తరించాలని కోరారు. అదనపు ఖర్చులను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 42కోట్లు కార్డులు అందజేశామన్నారు.