HYD: రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణతో వర్షపు నీటిని ఒడిసిపట్టే పరిస్థితి తగ్గుతుంది. దీంతో ఎండాకాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన IIT HYD విద్యా సంస్థ 654 ఎకరాల ప్రాంగణంలో లో లెవెల్ ఏరియాలో చెరువును అందుబాటులోకి తెచ్చింది. అక్కడ కురిసిన వర్షపు నీరు మొత్తం ఇందులోకి వచ్చి చేరుతుంది. దీని కెపాసిటీ 2.28 కోట్ల లీటర్లుగా తెలిపారు.