HYD: నగరంలో చీటికిమాటికి అమ్మాయిలను మనోవేదనకు గురి చేస్తున్న పోకిరిల సంఖ్య పెరుగుతుంది. షీ టీం బృందలు అనేక చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, రోజు 10 వరకు కేసులు నమోదవుతున్న పరిస్థితి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి సుమారు 3,700 మంది పోకిరిలు పోలీసులకు చిక్కారు. కేసులు సైతం నమోదయ్యాయి. అమ్మాయిలు వేధింలులకు గురైతే ఎవరికీ భయపడకుండా 100, 112 నంబర్లకు ఫిర్యాదు చేయండి.