నెల్లూరు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఒక ఘరానా దొంగను అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ చిట్టం కోటేశ్వరరావు తెలిపారు. గత నెల 22వ తేదీన వెంకటరమణ హోటల్ వద్ద పార్క్ చేసిన ఆటోను దొంగిలించినట్లు ఫిర్యాది మీర్జా జుల్ఫ్కర్ ఆలీ పేర్కొన్నారు. నిందితుడిని విచారించగా, అతని వద్ద నుంచి మరో పదకొండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు