KNR: చొప్పదండి మండలంలోని జ్ఞాన సరస్వతి ఆలయ తృతీయ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా, హనుమాన్ దేవాలయం మీదుగా పట్టణ ప్రధాన వీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.