KDP: స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరు వేగవంతం చేయాలని యూనియన్ బ్యాంక్ మేనేజర్ నాగిరెడ్డి ఏపీఎం ఆంజనేయులు కోరారు. సంఘాల ఆర్థిక పురోభివృద్ధికి రుణాల మంజూరు కీలకమని, అందుకే రుణాల ఆమోదం, బదిలీ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆయన అన్నారు. సభ్యుల అవసరాల మేరకు రుణాలు అందితే జీవనోపాధి కార్యక్రమాలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు.