AP: రాష్ట్రానికి నక్షా (NAKSHA) కింద కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని వెల్లడించారు. SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడంలో చూపిన ప్రగతికి కేంద్రం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. 10 పట్టణ స్థానిక సంస్థల్లో చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నిధులు మంజూరు చేసిందన్నారు.