‘అఖండ 2’ ప్రమోషన్స్‌లో భాగంగా నందమూరి బాలకృష్ట ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మద్రాస్ తన జన్మభూమి అని చెప్పారు. అలాగే, తెలంగాణ తన కర్మభూమి అని.. ఆంధ్రప్రదేశ్ ఆత్మభూమి అన్నారు. ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తవడం, ఇప్పటికీ హీరోగా కొనసాగుతుండటం గర్వంగా ఉందన్నారు. కాగా, బాలయ్య నటించిన ‘అఖండ-2’ శుక్రవారం విడుదల కానుంది.