MBNR: యాంటీ కరప్షన్ వీక్-2025 సందర్భంగా వారం పాటు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాల వాల్ పోస్టర్ను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్, అవినీతికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు సమాజంలో కీలకంగా ఉంటాయన్నారు. నిరంతర అవగాహన మరియు నైతిక విలువలతో అవినీతిని తగ్గించవచ్చని పేర్కొన్నారు.