AP: శ్రీశైలంలో మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనాన్ని ఈనెల 8 వరకు నిలిపివేస్తున్నట్లు ఆలయం ఈవో వెల్లడించారు. ప్రస్తుతం ఆలయంలో శివదీక్ష విరమణల రద్దీ కారణంగా స్పర్శ దర్శనం ఆపేస్తున్నట్లు తెలిపారు. సిఫార్సు లేఖలతో వచ్చే వారికి కూడా స్పర్శ దర్శనం ఉండదన్నారు. ఈనెల 5 వరకు రూ.5 వేల గర్భాలయ అభిషేకం, రూ.1500 సామూహిక అభిషేకాలు ఉంటాయని చెప్పారు.