WNP: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ నిర్వాహకులను ఆదేశించారు. పెబ్బేరు మండలంలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గోదాములను ఆయన తనిఖీ చేశారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చే ముందు తాలు, పొల్లు లేకుండా శుభ్రం చేసుకుని తీసుకురావాలని సూచించారు.