NLG: రామన్నపేటలోని భవిత సాహితీ విద్యా వనరుల కేంద్రంలో నల్గొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి గవ్వ జ్యోతి హాజరై పర్యవేక్షించారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యులు డా. వరుణ్ రెడ్డి, డా. ఉదయ్‌లు కలిసి స్థానిక ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించారు.