NLR: ఎన్డీఏ (NDA) ప్రభుత్వంలో మత్స్యకారులకు ఎంతో లబ్ధి చేకూరుతోందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకం అయిన ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద ఊటుకూరు, పల్లిపాలెం ప్రాంతాలకు చెందిన 10 మంది మత్స్యకారులకు 40 శాతం రాయితీతో మంజూరైన బోట్ల ఇంజిన్లను బుధవారం ఎమ్మెల్యే నెల్లూరులోని తన నివాసంలో వారికి అందజేశారు.