HYD: డబ్బు మత్తులో.. బంధాలు చిద్రం అంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగులో రూ.4 కోట్లకు బీమా చేయించి అన్నను తమ్ముడు ఘోరంగా హతమార్చాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దీనిపై సజ్జనార్ స్పందించారు. “ఏ బ్యాంక్ బ్యాలెన్స్ గుండె చప్పుడును కొనలేదు. ఏ బీమా పాలసీ పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేదు” అని పేర్కొన్నారు.