AP: మాజీమంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు రిజర్వు చేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు కొనసాగించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 10న తీర్పును వెల్లడించనుంది.