VZM: 2020లో సంతకవిటి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితులకు నాలుగు సంవత్సరాల ఆరు నెలల జైలు, రూ.12,000 జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. నిందితులు వెంపటాపు గోపి , కొప్పల రామినాయుడు బాధితుడిని కులం పేరుతో దూషించి, దాడి చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారన్నారు.