MDK: వెల్దుర్తి మండలంలో మూడో విడత నామినేషన్ల తొలి దినోత్సవం పూర్తయింది. మొత్తం 23 గ్రామపంచాయతీల సర్పంచ్ స్థానాలకు 25 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే 200 వార్డు స్థానాలకు 35 మంది అభ్యర్థులు నామినేషన్లను సమర్పించినట్లు ఎంపీడీవో ఉమాదేవి తెలిపారు.