MBNR: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సరైన కారణం లేకుండా నామినేషన్ పత్రాలు తిరస్కరించకూడదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి హెచ్చరించారు. కలెక్టర్, కలెక్టరేట్ కార్యాలయం నుండి వెబెక్స్ ద్వారా ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో శిక్షణ కార్యక్రమంలో పాల్గొని, ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి పనిచేయాలని సూచించారు.